ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ : నెట్ ఫ్లిక్స్ “పిట్ట కథలు” నుంచి టీం పింకీతో

Published on Feb 17, 2021 6:06 pm IST

ప్రపంచ దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ డిజిటల్ వరల్డ్ లో ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ను అందిస్తుందో అందరికీ తెలిసిందే. మరి మొట్ట మొదటిసారిగా వీరి నుంచి ఒక పక్కా తెలుగు ఎంటర్టైనర్ రాబోతుంది. అదే “పిట్ట కథలు”. ఈ 19న విడుదలకు రెడీగా ఉన్న ఈ చిత్రాన్ని టాలెంటెడ్ దర్శకులు తరుణ్ భాస్కర్, సంకల్ప్ రెడ్డి, నాగ్ అశ్విన్ అలాగే నందిని రెడ్డి లు తెరకెక్కించారు. మరి ఈ పింకీ టీం తో ఎక్స్ క్లూజివ్ గా ఒక ఇంటర్వ్యూ తీసుకున్నాం. రెబ్బా, అషిమా నర్వాల్, శ్రీనివాస్ అవసరాల, సత్యదేవ్ లాంటి టాలెంటెడ్ నటులు ఉన్న ఈ టీమ్ ఎం చెప్పారో చూద్దాం.

సంకల్ప్ రెడ్డి

మీరు కొన్ని ప్రయోగాత్మక సినిమాలు చేశారు, మరి ఈ ఆఫర్ ఎలా వచ్చింది?

నెట్ ఫ్లిక్స్ నుంచి ఈ ఆఫర్ వచ్చినపుడు నిజంగా చాలా షాక్ అయ్యాను. రిలేషన్స్ మీద నాకు ఈ ఆఫర్ వారి నుంచి ఇవ్వడం ఆశ్చర్యం అనిపించింది. కానీ ఆ తర్వాత అదే సరైన టైం అనిపించింది అలాగే నాకు కూడా మంచి ప్లాట్ ఫామ్ అనిపించింది సో అలా జరిగింది.

మీ ఎపిసోడ్ కోసం చెప్పండి, షార్ట్ గా సినిమాలో ఎలా చేయగలిగారు?

ఈ కథ కొంతమంది వ్యక్తులు సత్యదేవ్, అషిమా నర్వాల్, ఈషా రెబ్బా, శ్రీనివాస్ అవసరాల వారి సంబంధ బాంధవ్యాలు ఒక్కొక్కరికీ ఎలాంటి సమస్యలు ఉన్నాయ్? వాటిలో ట్విస్టులు ఎలా హ్యాండిల్ అయ్యాయి అన్నదే కథ. దీనిని మేము కేవలం 5 రోజుల్లోనే తీసేసాం నేను మాత్రం ఆడియెన్స్ ను రియాక్షన్ ఎలా ఉంటుందా అని ఎదురు చూస్తున్నా.

ఈషా రెబ్బ

చాలా మంది మీ రోల్ బోల్డ్ గా ఉంటుంది అంటున్నారు, ఎలా ఒప్పుకున్నారు?

అందరు చెప్తున్నట్టుగా నాదేమీ బోల్డ్ రోల్ కాదు, నేను చెయ్యబోయే రోల్ కాస్త కొత్తగా అనిపిస్తుంది అందరికీ. నాపై తీసిన సీన్స్ అన్నీ చాలా చక్కగా ఉంటాయి. రొమాన్స్ ను మించి ఎమోషన్స్ ఇందులో కనిపిస్తాయి. అలాగే ఈ సినిమాలో యాక్ట్ చెయ్యడం వల్ల నేను కూడా చాలా నేర్చుకున్నా.

సంకల్ప్ రెడ్డితో వర్క్ ఎలా ఉంది? అలాగే మొత్తం నెట్ ఫ్లిక్స్ తో కూడా

సంకల్ప్ తో వర్క్ చెయ్యడం చాలా ఆనందంగా ఉంది. అలాగే ఇందులో నటించడం కాస్త కొత్త ఎక్స్ పీరియన్స్ లా అనిపించింది. కానీ ఒకటి మాత్రం చెప్పగలను సంకల్ప్ తన నరేషన్ తో ప్రతీ ఒక్కరినీ షాక్ చేస్తాడు. అలాగే నెట్ ఫ్లిక్స్ తో అయితే రీచ్ కూడా ఎక్కువ ఉంటుంది నా కెరీర్ కు ఉపయోగపడుతుంది అని ఒప్పుకున్నా.

అషిమా నర్వాల్

మీ రోల్ కోసం ఏమన్నా చెప్పండి?

నేను ఇంతకు ముందే సంకల్ప్ తో పని చెయ్యాల్సి ఉంది కానీ అది అప్పట్లో కుదరలేదు. కానీ ఏ సినిమా కోసం తెలిసాక నాకు నేను గానే అప్రోచ్ అయ్యాను. నేను ఇందులో ఒక హౌస్ వైఫ్ రోల్ లో మంచి ఎమోషనల్ రోల్ లో కనిపిస్తాను.

మీ స్టోరీలో యూనిక్ గా అనిపించే పాయింట్ ఏదన్నా ఉందా?

నా స్టోరీ ద్వారా ఆడవారిలోని కొన్ని ఇంట్రెస్టింగ్ కోణాలు చూపించబడతాయి. నా రోల్ సరిగ్గా ఓ ఆడది పెళ్లి సమయానికి మోసం చెయ్యబడితే ఆమె ఎలా రియాక్ట్ అవుతుంది అలాగే అందరి ఆడవాళ్లు తమ లైఫ్ లో ఎదుర్కొనే సమస్యలు అణచివేతలు స్ట్రాంగ్ ఎమోషన్స్ తో కనిపిస్తాయి.

శ్రీనివాస్ అవసరాల

ఈ మొత్తం ఓటిటి మీద అలాగే నెట్ ఫ్లిక్స్ కల్చర్ కోసం మీరేం అనుకుంటున్నారు?

కొన్నాళ్ల పాటు యూఎస్ లో ఉన్న వాడిగా చెప్తున్నా నెట్ ఫ్లిక్స్ స్టోర్స్ నుంచి డీవీడీలు తీసుకొని ఎంజాయ్ చేసిన వాళ్లలో కూడా ఉన్నాను అక్కడ నుంచి ఇప్పటి వరకు పిట్టకథలు లాంటి మొట్ట మొదటి అంథాలజీ సినిమా చేసే వరకు వచ్చింది. అంటే ఱాబోయే రోజుల్లో ఓటిటి కల్చర్ ఇంకా బలపడుతుంది.

సంకల్ప్ తో వర్క్ ఎలా ఉంది అతని డైరెక్షన్ పై మీ టేక్ ఏంటి?

నేను ఇంతకు ముందే సంకల్ప్ తో అంతరిక్షం సినిమా చేశాను సో ఈ ఈసారి కొత్త కథ ఎలా చేస్తాడో అని కాస్త ఆతృత ఉంది. కానీ అతను టేకింగ్ విధానం ఎమోషన్స్ పై గ్రిప్ చూసి ఆశ్చర్యపోయాను. అలాగే అతను చూపించే ట్విస్టులు ప్రతీది ఆడియెన్స్ ను థ్రిల్ చేస్తాయి.

సంబంధిత సమాచారం :