ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ : హవీష్ – రవితేజ గారితో “ఖిలాడి” చాలా బాగా వస్తుంది

ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ : హవీష్ – రవితేజ గారితో “ఖిలాడి” చాలా బాగా వస్తుంది

Published on Jun 24, 2021 4:03 PM IST

అప్పట్లోనే తన “జీనియస్” సినిమాతో సెన్సేషన్ ను నమోదు చేసాడు యంగ్ యాక్టర్ “హవీష్”. అలాగే “నువ్విలా” అనే సినిమాతో కూడా మెప్పించాడు. మరి ఇప్పుడు మాస్ మహారాజ్ రవితేజ “ఖిలాడి” సినిమాకు నిర్మాతగా కూడా మరిన్ని చిత్రాలతో బిజీగా ఉన్నాడు. మరి రేపు తన బర్త్ డే సందర్భంగా ఓ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూని తీసుకున్నాం. మరి తాను ఎలాంటి విషయాలు పంచుకున్నాడో చూద్దాం.

 

సో ఈ బర్త్ డే ని ఎలా జరుపుకుంటున్నారు?

ప్రతిసారి నా బర్త్ డే కి మా పేరెంట్స్ విజయవాడ నుంచి హైదరాబాద్ కి వచ్చేవారు. కానీ ఈసారి నేనే అక్కడికి వెళ్తున్నాను. ఇప్పుడు కోవిడ్ టైం కాబట్టి పెద్దగా హంగామా లేకుండా సింపుల్ ఇంట్లోనే చేసుకుంటాను.

 

మరి స్పెషల్ అనౌన్స్మెంట్స్ ఏమన్నా ఉన్నాయా?

రేపు ఏమీ లేవు కానీ ప్రస్తుతానికి మూడు మంచి సినిమాలు ఓకే చేశాను. వాటిని మా ప్రొడ్యూసర్లే మంచి టైం చూసి అనౌన్స్ చేస్తారు.

 

మరి ఎలాంటి ప్రాజెక్ట్స్ సైన్ చేశారు?

లక్కీగా ఇప్పుడు నేను ఒప్పుకున్నా మూడు సినిమాలు మూడు డిఫరెంట్ జానర్లు. మొదటిది మంచి ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా. రెండోది వచ్చి యాక్షన్ డ్రామా.. మూడోది ఒక యూనిక్ కాన్సెప్ట్ తో ఉండే లవ్ స్టోరీ. ఈ మూడు నన్ను కొత్తగా ప్రెజెంట్ చేసుకోడానికి పనికొస్తాయని అనుకుంటున్నాను.

 

మరి ఇప్పుడు మీ కెరీర్ ను ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు?

నా స్టార్టింగ్ రోజుల్లో కేవలం కొన్ని సినిమాలే చెయ్యాల్సి వచ్చింది. ఎందుకంటే అప్పుడు ఒక సమయంలో ఒక్క సినిమానే కంప్లీట్ చెయ్యాలి అనుకునేవాడిని. కానీ అప్పుడు సినిమాలకు అంత టైం పట్టేది అనుకోలేదు. కానీ ఇప్పుడు మొత్తం మారింది ఈసారి ఒకే ఏడాదిలో మూడు సినిమాలు రిలీజ్ చేస్తాను.

 

నిర్మాతగా ఎలా అనిపిస్తుంది? ఎలాంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయ్?

ప్రొడక్షన్ అనేది నాకు చాలా బాగా పని చేసింది ఇండస్ట్రీలో మరింత మంది దగ్గరయ్యారు. అలాగే నా యాక్టింగ్ కి కూడా ప్రొడక్షన్ చాలా పనికొచ్చింది. ఇక మా నుంచి సినిమాలు విషయానికి వస్తే నేను రాబోయే రోజుల్లో పెద్ద లక్ష్యాలు పెట్టుకున్నాను. బిజినెస్ కోసం కూడా చాలా తెలుసుకున్నాను. హిందీలో అక్షయ్ కుమార్ తో ఓ సినిమా చేస్తున్నాం. రవితేజ గారితో ఖిలాడి కూడా చాలా బాగా వస్తుంది.

 

ఓటిటి కల్చర్ పై మీ అభిప్రాయం ఏంటి?

సిల్వర్ స్క్రీన్ అనుభూతిని ఓటిటి ఎప్పటికీ రీప్లేస్ చెయ్యలేదు. అలాగే ఈ ఓటిటి వరల్డ్ అనేది ఒక బాబుల్ లాంటిది ఒకసారి కానీ మళ్ళీ ప్రపంచం మాములు స్థితికి వస్తే ఓటిటి డౌన్ అయ్యిపోతుంది అనుకుంటున్నాను. నేను మాత్రం సిల్వర్ స్క్రీన్ రిలీజ్ కోసమే ఎదురు చూస్తున్నాను.

 

ఫైనల్ గా మీరు ముందు నుంచీ నటుడుగా అవ్వాలి అనుకున్నారా?

లేదు, మొదటి నుంచీ నాకు అలాంటి ఆలోచన లేదు. యూఎస్ నుంచి వచ్చాక మా నాన్న గారి ఎడ్యుకేషన్ బిజినెస్ లో జాయిన్ అయ్యాను. తర్వాత నాతో గంగోత్రి సినిమా హిందీలో తియ్యడానికి నాన్న గారి దగ్గరకి ఆఫర్ వచ్చింది కానీ అప్పుడు నో చెప్పేసాను. ఆ తర్వాత కూడా అలా చాలానే ఆఫర్స్ వస్తూ ఉండడంతో అప్పుడు యాక్టర్ కావాలని డిసైడ్ అయ్యాను.

 

సో ఇలా హవీష్ తో మా ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ పూర్తయ్యింది. మరి తన ఫిల్మీ కెరీర్ రానున్న రోజుల్లో విజయవంతంగా కొనసాగాలని ఆశిద్దాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు