ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ : వర్ష బొల్లమ – నేను విజయ్ దేవరకొండకు చాలా పెద్ద ఫ్యాన్ ని

Published on Nov 17, 2020 4:00 pm IST

తెలుగు ఆడియెన్స్ కు “విజిల్” అలాగే “జాను” సినిమాలో మంచి రోల్స్ తో కనిపించిన మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ నటి వర్ష బొల్లమ ఇప్పుడు హీరోయిన్ గా ఆనంద్ దేవరకొండతో చేసిన “మిడిల్ క్లాస్ మెలోడీస్” తో అరంగేట్రం చేసేందుకు రెడీగా ఉంది. ఇపుడు ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో డిజిటల్ రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూ ను ఆమె నుంచి తీసుకున్నాం. మరి ఆమె ఎలాంటి విశేషాలు చెప్పిందో ఇప్పుడు చూద్దాం.

 

మీ తెలుగు డెబ్యూ ఓ ప్లాప్, దానికి ఎలా ఫీలయ్యారు?

నా ఫస్ట్ సినిమా చూసి చూడంగానే తెలుగు ఆడియెన్స్ ఎలా ఆలోచిస్తారో అన్నది అర్ధం అయ్యింది. సినిమా మంచి ఫలితం అందుకోకపోయినా నాకు మంచి ప్రశంసలు వచ్చాయి. ఇక జాను తో మంచి టర్నింగ్ రావడంతో ఇప్పుడు హ్యాపీగానే ఉన్నాను.

 

ఈ ఆఫర్ ఎలా వచ్చింది?

చూసి చూడంగానే సినిమాకు చేసిన ఎడిటర్ నాకు ఈ చిత్రాన్ని రికమెండ్ చేసారు. అలా నేను భవ్య క్రియేషన్స్ వారితో చేసే అవకాశం వచ్చింది.

 

ఈ రోల్ కు ఎలా ప్రిపేర్ అయ్యారు?రోల్ కోసం ఎమన్నా చెప్పండి.?

ఈ సినిమాలో నేనొక చిన్న టౌన్ లో కనిపించే అమ్మాయిలా కనిపిస్తాను. సంధ్య అనే ఒక సరదాగా ఉండే అమ్మాయి హీరోతో లవ్ విషయంలో తన తండ్రికి భయపడుతుంది. అలాంటి రోల్ చేశాను. అలాగే నాకు ఉన్న లైన్స్ విషయంలో కాస్త భయపడ్డాను కానీ తర్వాత కరెక్ట్ చేసుకున్నాను. అలాగే గుంటూరు యాసను పట్టుకోడానికి చాలానే రీసెర్చ్ చేశాను.

 

ఆనంద్ కన్నా మీరెక్కువ సినిమాలు చేసారు అతనితో వర్క్ ఎలా అనిపించింది?

నేను ఆనంద్ డెబ్యూ సినిమా చూసాను డీసెంట్ గా అనిపించింది. కానీ ఈ సినిమాలో మాత్రం చాలా సర్ప్రైస్ అయ్యాను. తన రోల్ ను చాలా బాగా చేసాడు. గుంటూరు యంగ్ బాయ్ గా తన రోల్ లో జీవించేసాడు.

 

సినిమాలో హైలైట్స్ ఏమిటి?

సినిమాలోని రోల్స్ ను పక్కన పెడితే హీరో అండ్ మిగతావారిపై స్క్రిప్ట్ చాలా బాగుంటుంది. మంచి రోల్స్ అలాగే కామెడీ మంచి డ్రామా ఇవన్నీ బాగా అనిపిస్తాయి. చిన్న టౌన్స్ లో ఉండే ప్రతీ యువతకు ఈ స్టోరీ కనెక్ట్ అవుతుంది.

 

చాలా భాషల్లో నటిస్తున్నారు. ఎలా ఉంది అది?

ఈ ఏడాది నాకు కొంచెం స్పెషల్ ఎందుకంటే సౌత్ లో నాలుగు భాషల్లో సినిమాలు చేస్తున్నాను. అలాగే ప్రతీ సినిమాలోని మంచి రోల్స్ చేశాను. బిగిల్ తర్వాత మంచి రోల్స్ వచ్చాయి. అలాగే తెలుగులో సినిమాలు చెయ్యడానికి బాగా ఎగ్జైటింగ్ ఫీల్ అవుతున్నాను.

 

కెరీర్ ఆరంభంలో పడ్డ కష్టాలు కోసం చెప్తారా?

నేను ఇక్కడ ఉన్నా అంటే దాని వెనుక ఐదేళ్ల కఠిన కష్టం ఉంది. చాలా కష్టపడ్డాను. చాలా సినిమాలే చేశాను కానీ ఏవి క్లిక్కవ్వలేదు. కానీ 96 తో మంచి గుర్తింపు వచ్చింది. తర్వాత బిగిల్ చాలా మార్చేసింది. ఇప్పుడు నా నటనపై ఆధారపడి ఉన్న అవకాశాలు వస్తుండడం ఆనందంగా ఉంది.

 

మీరెప్పుడైనా నటిగా అవుతా అనుకున్నారా? మీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి?

అవును నేను నటిగా మారాలని నా నాలుగేళ్ళ ఏజ్ నుంచే ఫిక్సయ్యాను. నా కల నెరవేర్చుకోడానికి చాలా ట్రై చేశాను. ఇక నా బ్యాక్గ్రౌండ్ విషయానికి వస్తే కర్ణాటకలోని కూర్గ్ అనే చిన్న టౌన్ నుంచి నేను వచ్చాను. నా తల్లిదండ్రులు ఎప్పుడు నన్ను సపోర్ట్ చేసారు.

 

ఎవరైనా తెలుగు స్టార్స్ కోసం ఎమన్నా చెప్తారా?

ఖచ్చితంగా, చాలా మంది నన్ను ప్రేరేపించారు. సమంతా వల్ల నా కెరీర్ బిగినింగ్ లో పరోక్షంగా హెల్ప్ అయ్యారు. ఇక విజయ్ దేవరకొండకు అయితే నేను చాలా పెద్ద ఫ్యాన్ ని. తనతో ఒక్క సినిమా ఏదొక రోజు చేస్తాను.

 

ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి?

ఇప్పుడు రెండు తెలుగు సినిమాలు నేను చేస్తున్నాను. రాజ్ తరుణ్ తో ఒకటి ఫిక్సయ్యింది తొందరలోనే అనౌన్స్మెంట్ వస్తుంది. ఒక తమిళ్ ఫిల్మ్ కంప్లీట్ చేశాను. అలాగే ఇతర ముఖ్య భాషల్లో కూడా చేస్తున్నాను. మొత్తంగా నా కెరీర్ పై చాలా ఆసక్తిగా ఉన్నాను.

ఇక ఇలా వర్ష బొల్లమ తో మా ఇంటర్వ్యూ పూర్తయ్యింది. మరి ఆమెకు మా బెస్ట్ విషెష్ కూడా తెలుపుతున్నాం.

సంబంధిత సమాచారం :

More