
అవును, మీరు విన్నది నిజమే. రెండు దశాబ్దాల నుండి ప్రేక్షకులకు సూపర్ హిట్ సినిమాలు అందిస్తున్న లెజెండరీ డైరెక్టర్ కే.రాఘవేంద్ర రావు
త్వరలో ఒక టాక్ షోకి వ్యక్యాతగా వ్యవహరించనున్నారు. ఎక్కువగా మాట్లాడని, టీవిలలో కూడా ఎక్కువగా ఇంటర్వ్యూలు ఇవ్వని రాఘవేంద్ర రావుగారు టాక్ షో చేయడం అంటే సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
ఆయనను మనం ఎక్కువగా మాట్లాడడం చూసింది కేవలం హైదరాబద్ లో జరిగిన ‘వజ్రోత్సవం’ వేడుకలలో మాత్రమే. అయితే ఇప్పుడు ఈ షోలో అయన మాట్లాడడమే కాకుండా, వ్యాఖ్యాతగా కూడా వ్యవహరిస్తారు. ఈ షో హిందీలో వచ్చే ‘కాఫీ విత్ కరణ్’ని పోలి ఉంటుందని సమాచారం. ఈ షోలో రాఘవేంద్ర రావు టాలీవుడ్ లోని ప్రముఖులని ఇంటర్వ్యూ చేస్తారు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే, ఈ షోకి ఆయనే నిర్మాత మరియు దర్శకుడు.
దీని గురించి మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి 123telugu.com.

