“పుష్ప” రాజ్ రాకపై పెరుగుతున్న అంచనాలు.!

Published on Apr 7, 2021 11:00 am IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “పుష్ప”. క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ భారీ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ పై సాలిడ్ అంచనాలు ఉన్నాయి. మరి ఇదిలా ఉండగా రేపు బన్నీ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఈరోజు అదిరే టీజర్ ను కట్ చేసి రెడీగా ఉంచారు. మొన్ననే విడుదల చేసిన ప్రీ టీజర్ కే భారీ స్థాయి రెస్పాన్స్ వచ్చింది.

దీనితో ఈ రోజు సాయంత్రం రానున్న టీజర్ పై అంచనాలు మాత్రం అంతకంతకూ పెరుగుతూ వస్తున్నాయి. ముఖ్యంగా బన్నీ పేల్చే డైలాగ్స్ మరియు తన మాస్ లుక్ పై ఇందులో మంచి అంచనాలు ఉన్నాయి. అలాగే సుకుమార్ ఎలాంటి యాక్షన్ చూపిస్తారు అన్న దానిపై కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు. మరి ఈ టీజర్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :