“RRR” లో ఈ సీక్వెన్స్ పై పెరుగుతున్న అంచనాలు..!

“RRR” లో ఈ సీక్వెన్స్ పై పెరుగుతున్న అంచనాలు..!

Published on Jul 2, 2021 7:02 AM IST

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కూడా “రౌద్రం రణం రుధిరం” సినిమా పై ఎలాంటి అంచనాలు నెలకొన్నాయో తెలిసిందే. మెగాపవర్ స్టార్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంటి ఇద్దరు బడా మాస్ హీరోస్ తో దర్శకుడు రాజమౌళి ప్లాన్ చేసిన ఈ బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ మల్టీస్టారర్ భారీ రికార్డ్స్ కొల్లగొట్టడం ఖాయం అయ్యిపోయింది.

ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా అంతా కూడా పలు భారీ సీక్వెన్స్ లతో రాజమౌళి నింపేసారని ఎలాగో తెలిసిన విషయమే.. మరి వాటిలో ఓ సాలిడ్ యాక్షన్ సీక్వెన్స్ పై టాక్ బయటకి వచ్చింది. ఈ చిత్రంలో ఒక రైన్ యాక్షన్ సన్నివేశాన్ని రాజమౌళి ప్లాన్ చేసారని అది కూడా విజువల్ గా మామూలుగా ఉండదని టాక్.. దీంతో ఇప్పుడు దానిపై సినీ వర్గాల్లో మరిన్ని అంచనాలు ఎక్కువవుతున్నాయి.. మరి నిజంగా ఈ సాలిడ్ సన్నివేశం ఈ సినిమాలో ఉందో ఉంటే ఎవరితో ఉంటుందో అన్నది తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు