మాస్ మహారాజ్ టీజర్ పై పెరుగుతున్న అంచనాలు.!

Published on Apr 11, 2021 11:00 pm IST

ఈ ఏడాది సాలిడ్ కం బ్యాక్ తో పాటుగా తెలుగు ఇండస్ట్రీలో మొట్ట మొదటి బ్లాక్ బస్టర్ ను నమోదు చేసింది ఎవరు అంటే మాస్ మహారాజ్ రవితేజనే అని చెప్పాలి. తాను నటించిన “క్రాక్” భారీ హిట్ తో దాని తర్వాత సినిమా “ఖిలాడి” ను జెట్ స్పీడ్ తో కంప్లీట్ చేస్తున్నారు. అంతే కాకుండా ఈ చిత్రాన్ని దర్శకుడు రమేష్ వర్మ ఓ రేంజ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నారు.

మరి ఇప్పుడు ఈ చిత్రం నుంచి మేకర్స్ అదిరే టీజర్ కట్ ను రేపు విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు దీనికి సంబంధించి ఒక్కో పోస్టర్ ను మేకర్స్ విడుదల చేస్తున్నారు. మరి ఇవన్నీ చూస్తుంటే రవితేజ అభిమానుల్లో టీజర్ పై అంచనాలు మరో స్థాయికి పెట్టుకున్నారు.

మరి అలా మేకర్స్ సెట్ చేసారని చెప్పాలి. ఇప్పటికే ఈ చిత్రం రవితేజ కెరీర్ లోనే నెవర్ బిఫోర్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మరి ఈ టీజర్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రంలో రవితేజ డ్యూయల్ రోల్స్ చేస్తుండగా డింపుల్ హయాతి మరియు మీనాక్షి చౌదరిలు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :