మళ్ళీ “ఆదిపురుష్”కి ఊహించిందే జరిగిందా.?

Published on May 13, 2021 8:02 pm IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న పలు బిగ్గెస్ట్ బడ్జెట్ పాన్ ఇండియన్ ప్రాజెక్టులలో “ఆదిపురుష్” కూడా ఒకటి. మరి ఇదిలా ఉండగా ఈ భారీ చిత్రం ఇప్పటికే కొంత మేర షూట్ ముంబై లో పూర్తి చేసుకుంది. కానీ అక్కడ మళ్ళీ కోవిడ్ తగ్గకపోవడంతో మేకర్స్ మకాం మొత్తం హైదరాబాద్ కు షిఫ్ట్ చేసుకున్నారు. మరి ప్లానింగ్ ప్రకారం ఇక్కడ ఈ మే 15 నుంచే షూట్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు.

కానీ సడెన్ గా ఇక్కడ కూడా లాక్ డౌన్ ప్రకటించడంతో ఈ సారి ప్లాన్ చేసిన షూట్ కూడా వాయిదా పడొచ్చేమో టాక్ వచ్చింది. మరి ఇప్పుడు ఊహించిందే జరిగినట్టు తెలుస్తుంది. ఈ చిత్రం తాలూకా షూట్ మళ్ళీ వాయిదా పడినట్టుగా తెలుస్తుంది. మరి దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది. ఇక ఈ భారీ ఇతిహాస చిత్రంలో ప్రబస్ రాముని పాత్రలో నటిస్తుండగా కృతి సనన్ సీత పాత్రలో నటిస్తుంది. అలాగే సైఫ్ అలీఖాన్ రావణ పాత్రలో నటిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :