‘ఎక్స్‌ప్రెస్ రాజా’ ఆడియో రిలీజ్ డేట్

‘ఎక్స్‌ప్రెస్ రాజా’ ఆడియో రిలీజ్ డేట్

Published on Dec 17, 2015 12:43 PM IST

Express-Raja
తెలుగులో విలక్షణ సినిమాలతో తనదైన గుర్తింపు తెచ్చుకున్న హీరో శర్వానంద్ ఈ మధ్యే ‘రన్ రాజా రన్’, ‘మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు’ లాంటి వరుస హిట్స్‌తో సూపర్ ఫామ్‌లో ఉన్నారు. తాజాగా ఈ హిట్ ఫామ్‌ను కంటిన్యూ చేసేందుకు శర్వానంద్, ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ పేరుతో ఓ రోడ్ జర్నీ సినిమాతో శర్వానంద్ మనముందుకు రానున్న సంగతి తెలిసిందే. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’తో మెప్పించిన దర్శకుడు మేర్లపాక గాంధీ తెరకెక్కించిన ఈ సినిమాను వరుస హిట్స్‌తో పేరు తెచ్చుకున్న యూవీ క్రియేషన్స్ నిర్మించింది.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్, టీజర్ సినిమాకు భారీ క్రేజ్‌ను తెచ్చిపెట్టాయి. ఇక ఆ క్రేజ్‌ను క్యాష్ చేసుకునే దిశగానే పండగ సీజన్‌లో సినిమా వస్తే బాగుంటుందని ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ టీమ్ సినిమాను సంక్రాంతి పండగకు సెట్ చేసింది. ఇక ఇదిలా ఉంటే సినిమా ఆడియో రిలీజ్ నుంచి ఈ సినిమా ప్రమోషన్స్‌ను కూడా మొదలుపెట్టే ఆలోచనతో ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ టీమ్ ప్లాన్ చేస్తోంది. డిసెంబర్ 19న హైద్రాబాద్‌లోని శిల్పకళావేదికలో పెద్ద ఎత్తున ఆడియో రిలీజ్‌ను జరపనున్నట్లు ఈ సందర్భంగా టీమ్ ప్రకటించింది. ప్రవీణ్ లక్కిరాజు ఈ సినిమాకు సంగీతం సమకూర్చగా, శర్వానంద్ సరసన సురభి హీరోయిన్‌గా నటించారు. జనవరి 15న సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

తాజా వార్తలు