‘ఎఫ్ 3’ బిజినెస్ అప్పుడే అయిపోయిందా ?

‘ఎఫ్ 3’ బిజినెస్ అప్పుడే అయిపోయిందా ?

Published on Dec 18, 2020 3:00 AM IST

F3

‘ఎఫ్ 3’ మూవీ ఈరోజే అధికారికంగా లాంఛ్ అయింది. సూపర్ హిట్ ‘ఎఫ్ 2’కు ఇది సీక్వెల్. అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. గతేడాది జనవరిలో విడుదలైన ‘ఎఫ్ 2’ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. అందుకే ఈ సీక్వెల్ మీద మంచి క్రేజ్ ఉంది. ప్రేక్షకులే కాదు బిజినెస్ వర్గాల్లో సైతం సినిమాకు మంచి డిమాండ్ ఉంది. అందుకే సినిమా మొదలుకావడానికి ముందే సగం బిజినెస్ అయిపోయినట్టు తెలుస్తోంది.

ఈ చిత్రం యొక్క డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ మంచి ధర చెల్లించి సొంతం చేసుకుందట. అలాగే శాటిలైట్ హక్కులను కూడ ఒక లీడింగ్ టీవీ ఛానెల్ సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి సినిమా మొదలవ్వడానికి ముందే నిర్మాత దిల్ రాజు ప్రాఫిట్స్ చూస్తున్నారన్నమాట. ‘ఎఫ్ 2’ చిత్రం భార్య, భర్తల నేపథ్యంలో తెరకెక్కితే ఈ సీక్వెల్ మాత్రం మనీ నేసథ్యంలో ఉండనుంది. ఇందులో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ ప్రధాన పాత్రలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు