ఆ గౌరవం దక్కిన ఏకైక తెలుగు చిత్రంగా ఎఫ్2

Published on Oct 6, 2019 4:35 pm IST

ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలై ఘన విజయం సాధించిన ఎఫ్ 2 కి చిత్రం అరుదైన గౌరవం దక్కింది. గోవాలో జరగబోయే 50వ గోల్డెన్ జూబ్లీ ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(ఐఏఫ్ఏఫ్ఐ) ప్రదర్శనకు ఈ సినిమా ఎంపికైంది. నవంబర్ 20 నుండి 28 వరకు గోవాలో జరగబోయే ఐఏఫ్ఏఫ్ఐ వేడుకలో 76 దేశాలకు చెందిన 250 సినిమాలు ప్రదర్శితం కానున్నాయి. ఈ లిస్టులో 26 ఫీచర్ ఫిలింస్‌, 15 నాన్ ఫీచర్ ఫిలింస్ కూడా ఉన్నాయి. కాగా.. ఈ 26 ఫీచర్ ఫిలింస్‌లో ఎంపికైన ఏకైక తెలుగు చిత్రంగా `ఎఫ్ 2` అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది.

అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో వెంకటేష్‌, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్ హీరో హీరోయిన్లుగా నటించారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించగా, దేవిశ్రీ స్వరాలు సమకూర్చారు. ఎఫ్2 వెంకీ, వరుణ్ కెరీర్ లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది.

సంబంధిత సమాచారం :

More