ఫైనల్ అవుట్ ఫుట్ లో ‘ఫన్‌ అండ్‌ ఫస్ట్రేషన్‌’ !

Published on Jan 4, 2019 12:06 am IST

దర్శకుడు అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కలయికలో వస్తోన్న మల్టీ స్టారర్ ‘ఎఫ్ 2’ (ఫన్‌ అండ్‌ ఫస్ట్రేషన్‌). కాగా ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ నేటితో పూర్తి అయింది. దర్శకుడు అనిల్ రావిపూడి డబ్బింగ్ కి సంబధించిన చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటే.. ఆయనే స్వయంగా ఈ రోజు శబ్దాలయా స్టూడియోకి వచ్చి ఫైనల్ కరెక్షన్స్ ను చెక్ చేసి.. ఫైనల్ చేశారు.

ఇక అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని పూర్తి హాస్యభరితంగా చిత్రీకరించారట. ఈ చిత్రంలో వెంకటేశ్ జోడిగా తమన్నా.. వరుణ్ తేజ్ జోడిగా మెహరీన్ నటిస్తున్నారు. ఓ కీలక పాత్రలో నటకిరీటి రాజేంద్రప్రసాద్ కనిపించనున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలవ్వడానికి సిద్ధంగా ఉంది.

సంబంధిత సమాచారం :

X
More