ఎఫ్ 2 & మిస్టర్ మజ్ను లేటెస్ట్ కృష్ణా కలెక్షన్స్ !

Published on Jan 31, 2019 11:44 am IST

వెంకటేష్ , వరుణ్ తేజ్ ల మల్టీ స్టారర్ ఎఫ్ 2 బాక్సాఫీస్ వద్ద కొంచెం నెమ్మదించింది. ఈ చిత్రం నిన్న కృష్ణా జిల్లాలో 1. 54 లక్షల షేర్ ను రాబట్టింది. ఇక 19 రోజుల్లో ఈచిత్రం అక్కడ 4. 78 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. ఓవరాల్ గా ఈచిత్రం డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలను తీసుకొచ్చింది.

ఇక యువ హీరో అఖిల్ అక్కినేని నటించిన రొమాంటిక్ ఎంటర్టైనెర్ మిస్టర్ మజ్నుమాత్రం కలెక్షన్ల పరంగా నిరాశపరుస్తూనే వుంది. బుధవారం కృష్ణా లో ఈ చిత్రం 1. 39లక్షల షేర్ ను రాబట్టి ఆరు రోజులకుగాను అక్కడ 60 లక్షల షేర్ ను రాబట్టింది. దాంతో ఈచిత్రం అన్ని ఏరియాల్లో నష్టాలను తీసుకురానుంది.

సంబంధిత సమాచారం :