టీఆర్పీ రేటింగ్స్ లో అదరగొట్టిన ఎఫ్ 2 !

Published on Apr 18, 2019 3:25 pm IST

విక్టరీ వెంకటేష్ , వరుణ్ తేజ్ ల మల్టీ స్టారర్ ఎఫ్ 2 సంక్రాంతి కి విడుదలై 75కోట్ల షేర్ తో బిగ్గెస్ట్ బ్లాక్ బ్లాస్టర్ సినిమా గా రికార్డు సృష్టించింది. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు. ఈ చిత్రం ఇప్పుడు బాలీవుడ్ లో కూడా రీమేక్ కానుంది.

ఇక ఈ సినిమా ఇటీవల స్టార్ మా టీవీ లో ప్రసారం కాగా 17.2 రేటింగ్స్ ను రాబట్టి బుల్లితెర ఫై కూడా సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా తో పాటు ఇటీవల టెలివిజన్ లో యాత్ర ,పేట సినిమాలు ప్రసారం కాగా యాత్ర 6.2 రేటింగ్స్ ను అలాగే పేట 3.9 రేటింగ్స్ ను రాబట్టుకున్నాయి.

సంబంధిత సమాచారం :