ఈ సంక్రాంతికి పోటీగా వచ్చిన మూడు తెలుగు చిత్రాల్లో ‘ఎఫ్2’ బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ ను రాబడుతూ దూసుకుపోతుంది. మొదటి షో నుంచే మంచి పాజిటివ్ రిపోర్ట్స్ ను సొంతం చేసుకున్న ఈ చిత్రం విడుదలైన 16 వ రోజు కూడా ‘ఎఫ్ 2’ నైజాం ఏరియాలో బాక్స్ ఆఫీసు వద్ద మంచి వసూళ్లు రాబడుతూనే ఉంది.
గురువారం నాడు, నైజాంలో ‘ఎఫ్ 2’ బాక్స్ ఆఫీస్ వద్ద రూ. 11 లక్షల వసూలు చేసి.. మొత్తం 20 రోజులకు గానూ రూ . 21.21 కోట్ల మైలురాయిని అందుకోవడం విశేషం. ఎఫ్ 2 మొత్తానికి ఈ సంక్రాంతి విన్నర్ గా నిలవడంతో పాటు వెంకీ మరియు వరుణ్ తేజ్ కెరీర్ లో హైయ్యెస్ట్ కలెక్షన్స్ కలెక్ట్ చేసిన చిత్రంగా నిలిచింది.


