ఓటిటి పార్ట్ నర్ ను ఫిక్స్ చేసుకున్న “ఎఫ్ 3”

Published on May 27, 2022 11:00 pm IST


విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఎఫ్3 కోసం మరోసారి చేతులు కలిపారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజా వార్త ఏమిటంటే, ఎఫ్ 3 చిత్రం యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫారమ్, సోనీ లివ్, భారీ ధరకు పొందింది. కాబట్టి, థియేట్రికల్ రిలీజ్ తర్వాత సినిమా ఒకటి లేదా రెండు నెలల్లో స్ట్రీమ్ అవుతుంది.

ఈ సినిమాలో తమన్నా భాటియా, మెహ్రీన్ పిర్జాదా, సోనాల్ చౌహాన్ కథానాయికలు గా నటించారు. సునీల్, అలీ, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్, అన్నపూర్ణ, ప్రగతి తదితరులు ఈ అవుట్ అండ్ అవుట్ కామెడీ మూవీలో సపోర్టింగ్ రోల్స్ పోషించారు. దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :