‘ఎఫ్ 3’ నవంబర్ నుండేనా ?

‘ఎఫ్ 3’ నవంబర్ నుండేనా ?

Published on Apr 11, 2020 12:30 AM IST

టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్సకత్వంలో కామెడీ కింగ్ వెంకటేష్, యంగ్ హీరో వరుణ్ తేజ్ కలిసి చేసిన చిత్రం ‘ఎఫ్ 2’. గతేడాది సంక్రాంతికి విడుదలైన చిత్రం ఘనవిజయాన్ని అందుకుంది. కాగా ఈ సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ ‘ఎఫ్ 3’ రూపొందిస్తామని అప్పుడే అనౌన్స్ చేశాడు అనిల్ రావిపూడి. ఇప్పటికే అనిల్ రావిపూడి ఈ సినిమా స్క్రిప్ట్ తయారుచేసే పనిలో ఉన్నాడు. మరో రెండు నెలల్లో స్క్రిప్ట్ పనులు కూడా పూర్తవుతాయట. ఈ చిత్రాన్ని నవంబర్ నెల నుండి మొదలుపెట్టాలనే ఆలోచనలో ఉన్నారట.

కాగా నిర్మాత దిల్ రాజు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ప్రస్తుతం వెంక్కీ ‘నారప్ప’ సినిమా చేస్తున్నాడు, వరుణ్ తేజ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో ఒక చిత్రం చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు అక్టోబర్ సమయానికి పూర్తవుతాయట. వీటి తర్వాత చేయడానికి వరుణ్, వెంకీలు ఇంకా వేరే కొత్త చిత్రాలకు సైన్ చేయలేదు. అందుకే అదే సమయానికి ‘ఎఫ్ 3’ని మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నారు దిల్ రాజు, అనిల్ రావిపూడి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు