అవి ఒట్టి పుకార్లు మాత్రమేనట !

Published on Mar 25, 2020 8:00 am IST

నేషనల్ స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఎస్.ఎస్.రాజమౌళి ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ పనుల్లో ఉన్నారు. వచ్చే యేడాది జనవరిలో ఈ చిత్రం విడుదలకానుంది. అంటే ఇంకా చాలా సమయం ఉంది. కానీ రాజమౌళి తర్వాతి చిత్రం ఏమిటని ఇప్పటి నుండే ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇదేనంటూ రూమార్లు మొదలయ్యాయి. ఆ సినిమాలో హీరో రామ్ అని, లేదూ రానా అని వార్తలు వచ్చేశాయి. ఇప్పటికే రచయిత విజయేంద్ర ప్రసాద్ కథను కూడా రెడీ చేశారని కూడా రాస్తున్నారు. అయితే ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని కేవలం అవి ఒట్టి పుకార్లు మాత్రమే అని తెలుస్తోంది.

ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో రాజమౌళి డైరెక్షన్ లో రాబోతున్న అత్యంత భారీ క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ నుండి ఉగాది సందర్భంగా మోషన్ పోస్టర్ తో కూడుకున్న టైటిల్ లోగోను ఈ రోజు రిలీజ్ చేయనున్నారు. రాజమౌళి అంతర్జాతీయ స్థాయిలో రూపొందిస్తున్న ఈ చిత్రం అప్ డేట్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More