కమల్ సినిమాలో విలన్‌గా మోస్ట్ టాలెంటెడ్ హీరో ?

కమల్ సినిమాలో విలన్‌గా మోస్ట్ టాలెంటెడ్ హీరో ?

Published on Dec 9, 2020 2:00 AM IST

Fahadh Kamal

సీనియర్ స్టార్ హీరో కమల్ హాసన్ ప్రస్తుతం చేస్తున్న కొత్త చిత్రం ‘విక్రమ్’. లోకేష్ కనగరాజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే విడుదలైన సినిమా టీజర్ అభిమానుల్ని, ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. సినిమా మీద అంచనాలు కూడ పెరిగాయి. పొలిటికల్ థ్రిల్లర్ గా ఈ చిత్రం ఉండబోతోంది. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా ఒక ప్రముఖ నటుడి పేరు వినిపిస్తోంది. అతనే ఫహాద్ ఫాజిల్. ఈయన సినిమాలో విలన్ పాత్ర చేయనున్నారని తమిళ సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

అయితే ఈ వార్త మీద ఇప్పటివరకు అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే ఏదీ రాలేదు. ఫహద్ ఫాజిల్ విలన్ అనగానే ప్రేక్షకులు మరింత ఎగ్జైట్ అవుతున్నారు. ఎందుకంటే ఫహాద్ ఫాజిల్ కు నటుడిగా గొప్ప క్రేజ్ ఉంది. ఈమధ్య కాలంలో మలయాళంలో వచ్చిన మంచి సినిమాల్లో ఫహాద్ ఫాజిల్ చేసిన సినిమాలు చాలావరకు ఉన్నాయి. ‘ట్రాన్స్, కుమ్బలంగి నైట్స్, మహేషింటే ప్రతీకారం’ లాంటి సినిమాల్లో ఆయన నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. పలు అవార్డులు కూడ దక్కాయి ఆయన నటనకు. అందుకే ఫహద్ ఫాజిల్ లాంటి మంచి నటుడు కమల్ సినిమాలో చేయవచ్చనే వార్తలు రాగానే సినిమా మరింత గొప్పగా ఉంటుందని అంటున్నారు ప్రేక్షకులు.

తాజా వార్తలు