‘ఫలక్ నుమా దాస్-2’ వచ్చే ఏడాదిలోనే !

Published on Jun 18, 2019 3:00 am IST

విశ్వక్‌ సేన్‌ దర్శకుడిగా – హీరోగా, కరాటీ రాజు నిర్మాణంలో వచ్చిన చిత్రం ‘ఫలక్ నును దాస్’ మొత్తానికి హిట్ టాక్ తెచ్చుకుని బాగానే ఆడింది. హర్షిత గౌర్, సలోని మిశ్రా హీరోయిన్స్ గా నటించగా, దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ సినిమాలో కీలక పాత్రను పోషించారు. కాగా సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో విడుదల అయిన ఈ చిత్రం..ముఖ్యంగా నైజాంలో బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ ను రాబట్టింది.

అయితే ఈ సినిమా సక్సెస్ మీట్ లో ఈ చిత్ర నిర్మాత కరాటే రాజు మాట్లాడుతూ… మా నెక్స్ట్ చిత్రం ‘ఫలక్ నుమా దాస్ 2’తో భారీ క్యాస్టింగ్ తో మరోసారి మీ ముందుకు వస్తామని తెలిపారు. కాగా ప్రస్తుతం ‘ఫలక్ నును దాస్ 2’ స్క్రిప్ట్ పనులు కూడా జరుగుతున్నాయి. అయితే స్క్రిప్ట్ కి మరో నాలుగు నెలల్లో పూర్తి అయినా.. సినిమాని మాత్రం వచ్చే ఏడాదే మొదలు పెడతారట.

ప్రస్తుతం విశ్వక్‌ సేన్‌ హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాతో పాటు హీరోగా మరో సినిమా కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ‘ఫలక్ నును దాస్ 2’ను వచ్చే ఏడాదికి ఫోస్ట్ ఫోన్ చేశాడు.

సంబంధిత సమాచారం :

X
More