పవన్ పై ‘ఫ్యామిలీ మ్యాన్’ నటుడి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!

Published on Jun 18, 2021 2:00 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న ప్రస్తుత సాలిడ్ ప్రాజెక్ట్స్ లో మళయాళ సూపర్ హిట్ చిత్రం “అయ్యప్పణం కోషియం” రీమేక్ కూడా ఒకటి. మాస్ లో విపరీతమైన క్రేజ్ ను సంతరించుకున్న ఈ చిత్రం షూట్ రీస్టార్ట్ కు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రంలో టాలెంటెడ్ నటుడు ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య, ఫ్యామిలీ మ్యాన్ 2 ఫేమ్ నటుడు రవీంద్ర విజయ్ లేటెస్ట్ గా బాలీవుడ్ వర్గాల్లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో పవన్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

అయితే తాను ఈ సినిమాలో ఒక కీలక పాత్ర చేస్తున్నానని అలాగే తనకి పవన్ ఒక హెవీ యాక్షన్ సీన్ ఉండగా అలాంటి సీన్స్ లో పవన్ తన కో ఆర్టిస్ట్ చిన్నవాళ్లు అయినా పెద్దవాళ్ళు అయినా తీసుకునే కేర్ చాలా బాగుంటుంది తెలిపారు. కనీసం చిన్న దెబ్బ కూడా తగలకుండా వెంట్రుక వాసి దూరంలో పవన్ యాక్షన్ సీన్స్ చేసే వారని రవీంద్ర తెలిపారు. దీనితో పవన్ పై తాను చేసిన ఈ కామెంట్స్ పవన్ అభిమానులలో మంచి వైరల్ అవుతున్నాయి.

సంబంధిత సమాచారం :