‘నందమూరి హరికృష్ణ’కు కుటుంబ సభ్యుల నివాళి !

Published on Aug 18, 2019 3:38 pm IST

తెలుగుదేశం పార్టీ నాయ‌కుడు దివంగత సీనియర్‌ నేత, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణగారి ప్రథమ వర్థంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. హరికృష్ణ నివాసంలో చంద్రబాబు నాయుడు, హరికృష్ణ కుమారులు జూ ఎన్టీఆర్‌, కల్యాణ్‌ రామ్‌ తదితరులు ఘనంగా నివాళులర్పించారు. గత ఏడాది ఆగస్టు 29న జరిగిన రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణగారు కన్నుమూశారు.

నల్గొండ సమీపంలోని అన్నేపర్తి వద్ద నందమూరి హరికృష్ణ ప్రయాణిస్తున్న కారు బోల్తా పడటంతో ఈ ప్రమాదం సంభవించింది. హరికృష్ణ హఠాన్మరణం సినీపరిశ్రమను, కుటుంబ సభ్యుల్ని శోకసంద్రంలో ముంచింది. హరికృష్ణగారి ప్రథమ వర్థంతి సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు తమ నివాళులర్పిస్తున్నారు. కాగా హ‌రికృష్ణ‌తో స‌త్సంబంధాలున్న వారు ఈ సంద‌ర్భంగా హ‌రికృష్ణ‌తో త‌మ అనుబంధాన్ని నెమ‌రువేసుకుంటున్నారు.

సంబంధిత సమాచారం :