వెయిటింగ్ లిస్ట్ లో ఫ్యామిలీ చిత్రాల దర్శకుడు !

Published on Jun 10, 2019 9:30 am IST

‘శతమానం భవతి’, ‘ ‘శ్రీనివాస కళ్యాణం’ లాంటి ఫ్యామిలీ చిత్రాల దర్శకుడు సతీష్ వేగేశ్న ప్రస్తుతం మరో సినిమా కోసం ఎదురుచూపులు చూడాల్సిన పరిస్థితి. ‘శ్రీనివాస కళ్యాణం’ ప్లాప్ అవ్వడంతో ఈ దర్శకుడికి స్టార్ హీరోలు డేట్లు ఇచ్చే ఛాన్స్ లు లేవు. అయితే ఇప్పటికే కళ్యాణ్ రామ్ కి కథ చెప్పి ఒప్పించిన సతీష్ వేగేశ్న.. సినిమా మొదలు పెట్టడానికి మాత్రం, మరో మూడు నెలలు వెయిట్ చెయ్యాలంట. మొదట జులై నుండి ఈ సినిమా షూటింగ్ ని మొదలు పెట్టాలనుకున్నప్పటికీ.. కళ్యాణ్ రామ్ ప్రస్తుతం రెండు సినిమాల్లో బిజీగా ఉండటం వల్ల జులై నుండి ఈ సినిమా మొదలయ్యేలా కనిపించడంలేదు.

కాగా తాజా సమాచారం ప్రకారం సెప్టెంబర్ నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు అవుతుందట. కాగా ప్రస్తుతం నందమూరి కళ్యాణ్ రామ్ నూతన దర్శకుడు మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘తుగ్లక్’ సినిమాలో నటిస్తున్నాడు. అలాగే ఉయ్యాల జంపాల, మజ్ను చిత్రాల దర్శకుడు విరించి వర్మతో కూడా కళ్యాణ్ రామ్ సినిమా చేయనున్నాడు.

సంబంధిత సమాచారం :

More