ఆత్మహత్య చేసుకున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ !

Abijiti

ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ అభిజిత్ షిండే ఈ రోజు మధ్యాహ్నం తన హౌస్ లో ఫ్యాన్‌ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ దురదృష్ట సంఘటనకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా ఆయన ఆత్మహత్యకు పాల్పడే ముందు, ఓ సూసైడ్ నోట్ రాసినట్లు తెలుస్తోంది. తన ఆస్తి అంతా తన రెండేళ్ల కూతురికి మాత్రమే చెందాలని ఆయన తన సూసైడ్ నోట్ లో రాశారట. అభిజిత్ బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలకు కొరియోగ్రఫీ అందించారు.

అయితే అభిజిత్ షిండే కొంత కాలంగా డిప్రెషన్‌ కి గురవుతున్నారని.. ఆయన తన భార్యకు కూడా నాలుగు నెలలుగా దూరంగా ఉంటున్నారని పోలీసుల దర్యాప్తులో తేలింది. అభిజిత్ షిండే మృతదేహానికి పోస్ట్‌మార్టం అనంతరం దహనసంస్కారాలు నిర్వహించనున్నారు.

Exit mobile version