“ఆదిపురుష్” కి ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్స్.?

Published on Jun 8, 2021 2:00 pm IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న పలు భారీ చిత్రాల్లో దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కిస్తున్న భారీ ఇతిహాస చిత్రం “ఆదిపురుష్” కూడా ఒకటి. ఈ చిత్రంలో రామునిగా ప్రభాస్, సీతగా కృతి సనన్ మరియు సైఫ్ అలీ ఖాన్ రావణ పాత్రలో నటిస్తున్నారు. అయితే గత కొన్నాళ్లుగా కేవలం క్యాస్టింగ్ పరంగానే టాక్ వినిపించిన ఈ చిత్రంపై లేటెస్ట్ బజ్ మరొకటి బయటకి వచ్చింది.

ఈ చిత్రానికి మేకర్స్ బాలీవుడ్ కు చెందిన ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్స్ కాంబో సచెత్ – పరంపర టాండన్ లు సంగీతం అందిస్తున్నారని టాక్ ఇప్పుడు తెలుస్తుంది. అయితే వీరిద్దరి ట్రాక్ రికార్డు చూసుకున్నట్టయితే ఓంరౌత్ లాస్ట్ చిత్రం “తనాజీ”కి మ్యూజిక్ కంపోజ్ చెయ్యడంతో పాటుగా అర్జున్ రెడ్డి రీమేక్..

“కబీర్ సింగ్” కి సాలిడ్ చార్ట్ బస్టర్ అలాగే “స్ట్రీట్ డాన్సర్ 3” ఇప్పుడు “జెర్సీ” రీమేక్ కు కంపోజ్ చేస్తున్నారు. అలాగే ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ చిత్రం “సాహో” లో సైకో సైయాన్ సాంగ్ ను కూడా పాడారు. మరి ఫేమస్ కంపోజర్స్ ఈ చిత్రానికి ఫిక్స్ అయ్యారని తెలుస్తుంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఎప్పుడు వస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :