వైరల్ అవుతున్న చిరు 152మూవీ టైటిల్, విషయం ఏమిటంటే…!

వైరల్ అవుతున్న చిరు 152మూవీ టైటిల్, విషయం ఏమిటంటే…!

Published on Oct 18, 2019 8:00 AM IST

సైరా లాంటి భారీ విజయం తరువాత చిరంజీవి దర్శకుడు కొరటాల శివతో చేస్తున్నారు. చిరంజీవి 152వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీ ఇటీవలే పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయింది. మహేష్ తో భరత్ అనే మూవీ చేసిన కొరటాల చిరు మూవీ కోసం ఏడాదికి పైగా ఎదురు చూస్తున్నారు. సామజిక అంశాలను కథగా తీసుకొని, కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి స్టార్ హీరోలతో సినిమాలు చేయడం కొరటాల ప్రత్యేకత. ఈ అపజయమెరుగని దర్శకుడు చిరు కోసం కూడా ఓ సోషల్ ఎలిమెంట్ తో కూడిన పవర్ ఫుల్ స్టోరీ సిద్ధం చేశారని తెలుస్తుంది.

కాగా నిన్న చిరు, కొరటాల మూవీ టైటిల్ ఇదేనంటూ ఒక పోస్టర్ సోషల్ మాధ్యమాలలో విపరీతంగా వైరల్ అయ్యింది. గోవిందం ఆచార్య అనే టైటిల్ తో ప్రచారం అయిన ఆ పోస్టర్ లో చిరు కమ్యూనిస్ట్ గెటప్ లో గన్ పట్టుకొని ఉండగా, వెనుక జండాలు పట్టుకున్న దళం ఉంది. ఐతే నిజం ఏమిటంటే అది ఒరిజినల్ కాదు. ఓ అభిమాని చేసిన ఫ్యాన్ మేడ్ పోస్టర్. వాస్తవానికి దగ్గరగా, సహజంగా ఉన్న ఆ టైటిల్ పోస్టర్ అందరినీ బోల్తా కొట్టించింది.

కాగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న కొణిదెల ప్రొడక్షన్స్ ఈ విషయం పై స్పందించారు. మేము ఈ చిత్రానికి ఇంకా టైటిల్ నింర్ణయించలేదని, టైటిల్ పెట్టిన వెంటనే అధికారికంగా ప్రకటిస్తాం అని ట్విట్టర్ పోస్ట్ చేశారు. దీనితో ప్రచారం అవుతున్న ఆ టైటిల్ పోస్టర్ లో ఏమాత్రం నిజం లేదని తెలిసిపోయింది. త్వరలో సెట్స్ పైకెళ్ళనున్న ఈ మూవీలో హీరోయిన్ ఎవరనేది ఇంకా నిర్ణయం కాలేదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు