‘లై’ శాటిలైట్ హక్కులకు మంచి డీల్ !


‘అ..ఆ’ విజయం తర్వాత యంగ్ హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం ‘లై’ ఆరంభం నుండి మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. అంతేగాక విడుదలైన టీజర్, ట్రైలర్ రెండూ కూడా బాగుండటంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. దీంతో సినిమా హక్కులు భారీ ధర పలుకుతున్నాయి.

ముఖ్యంగా శాటిలైట్ హక్కులకు మంచి డీల్ కుదిరింది. ప్రముఖ టీవీ ఛానెల్ జీ తెలుగు భారీ మొత్తం చెల్లించి హక్కుల్ని కొనుగోలుచేసింది. ఆగష్టు 11న విడుదలకానున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో మేఘా హీరోయిన్ గా నటిస్తోంది. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తుండగా సీనియర్ హీరో అర్జున్ నెగెటివ్ పాత్ర పోషిస్తున్నాడు.