“మనీ హైస్ట్ సీజన్ 5” స్ట్రీమ్ కోసం అభిమానులు వెయిటింగ్!

Published on Sep 1, 2021 7:26 pm IST

మనీ హైస్ట్ వెబ్ సిరీస్ ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకుంది. ఈ వెబ్ సిరీస్ కోసం మునుపెన్నడూ లేని విధంగా ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకూ నాలుగు సీజన్ లు పూర్తి చేసుకున్న ఈ సీరీస్ ఇప్పుడు ఐదవ సీజన్ ప్రసారం అయ్యేందుకు సిద్దం అవుతుంది. ప్రముఖ ఓటిటి దిగ్గజం అయిన నెట్ ఫ్లిక్స్ లో ఈ వెబ్ సిరీస్ ప్రసారం కానుంది.

లాక్ డౌన్ కారణం గా మనీ హైస్ట్ సీజన్ 5 విడుదల ఆలస్యం అయ్యింది. ఇటీవల సెప్టెంబర్ 3 నుండి స్ట్రీమ్ కానున్నట్లు ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇండియా లో సైతం మునుపెన్నడూ లేని విధంగా ఒక వెబ్ సిరీస్ కి ఇంతగా ప్రమోషన్స్ చేస్తున్నారు మేకర్స్. ఈ వెబ్ సిరీస్ ఇండియా లో సెప్టెంబర్ మూడవ తేదీన మధ్యాహ్నం 12:30 గంటల నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ సీరీస్ కోసం సర్వత్రా అభిమానులు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

ఈ ఐదవ సీజన్ మొదటి వాల్యూం ఐదు ఎపిసోడ్ లుగా రానుంది. అదే తరహాలో రెండవ వాల్యూం డిసెంబర్ లో ఐదు ఎపిసోడ్ లతో ప్రేక్షకులను అలరించనుంది.

సంబంధిత సమాచారం :