“సాహో” కారణంగా “ఆర్ ఆర్ ఆర్” పై అనుమానాలు

Published on Jul 20, 2019 7:58 am IST

“సాహో” సినిమా విడుదలపై ఏర్పడిన ఉత్కంఠకు తెరదింపుతూ,నిన్న నిర్మాతలు ఆగస్టు 30న విడుదల చేస్తున్నామని అధికారిక ప్రకటన చేసినప్పటికీ అనుకున్న సమయానికి రాలేదన్న అసహనం మాత్రంలో అభిమానులలో, అలాగే నిర్మాతలలో కనిపించింది. ఈ విషయంలో దర్శకుడు సుజీత్ విఫలం చెందారనే చెప్పాలి. ఈ చిత్ర సంగీత దర్శకులు చిత్రం నుండి బయటకి వెళ్ళిపోయినప్పుడు, “సాహో” ఆలస్యం అయ్యే అవకాశం ఉందని చాలా మంది జోస్యం చెప్పారు. కానీ దర్శకుడు సుజీత్ చెప్పిన ప్రకారం ఆగస్టు 15న చిత్రాన్ని విడుదల చేస్తాం అని ప్రకటించడం జరిగింది. కారణాలేమైనా ఆయన అన్నమాట నిలబెట్టుకోలేకపోయారనే చెప్పాలి.

“సాహో” విడుదల ఆలస్యం నేపథ్యంలో సినీ అభిమానుల ఫోకస్ “ఆర్ ఆర్ ఆర్” పైకి మళ్లింది. రాజమౌళి ప్రకటించిన విధముగా “ఆర్ ఆర్ ఆర్” ని వచ్చే ఏడాది జులై 30 కి విడుదల చేస్తారా లేదా అనే అనుమానాలు రేగుతున్నాయి. ఈ అనుమానాలకు కారణంగా కూడా ఉంది, ఈ మూవీలో హీరోలైన చరణ్,తారక్ ఇద్దరూ షూటింగ్ సమయంలో గాయాలపాలు కావడంతో షెడ్యూల్ అనుకున్నదాని కంటే రెండు నెలల ఆలస్యం అయ్యింది. కాబట్టి ఆర్ ఆర్ ఆర్ కూడా అనుకున్న సమయానికి విడుదల కావడం కష్టమే అని కొందరి అభిప్రాయం. సాహో విడుదల విషయంలో సుజీత్ విఫలం చెందగా,రాజమౌళి ఏమి చేస్తాడో చూడాలి.

సంబంధిత సమాచారం :