ఎన్టీఆర్ ని బాగా మిస్సవుతున్న ఫ్యాన్స్

Published on Aug 6, 2020 1:50 am IST


ఎన్టీఆర్ నుండి ఇంత భారీ గ్యాప్ ఎప్పుడూ రాలేదు. ఎనర్జిటిక్ గా ఉండే ఎన్టీఆర్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు తీస్తూ ఫ్యాన్స్ లో జోష్ నింపుతూ ఉండేవారు. కెరీర్ లో ఒక్క 2009లో మాత్రమే ఎన్టీఆర్ నుండి మూవీ రాలేదు. అలాంటిది 2018 అక్టోబర్ లో అరవింద సమేత మూవీతో వచ్చిన ఎన్టీఆర్ మళ్ళీ తెరపై కనిపించలేదు. అంటే మరో రెండు నెలలో ఆయన్ని తెరపై చూసి రెండేళ్లు అవుతుందన్న మాట. అనుకున్నట్లు జరిగితే ఆర్ ఆర్ ఆర్ గత నెల 30న విడుదల కావల్సింది.

ఇక ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ మరింత డిలే అవుతుండగా, ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో అసహనం పెరిగిపోతుంది. కనీసం కొమరం భీమ్ గా ఆయన ఫస్ట్ లుక్ వీడియో తో సరిపెట్టుకుందాం అంటే అది కూడా జరగలేదు. షూటింగ్ మెటీరియల్ లేదని, లాక్ డౌన్ కారణంగా షూటింగ్ కూడా జరపలేమని రాజమౌళి ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియో వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో అటు సినిమా విడుదల కాక, కనీసం ఫస్ట్ లుక్ వీడియో లేక ఫ్యాన్స్ అల్లాడిపోతున్నారు.

సంబంధిత సమాచారం :

More