అందరి చూపు ఆ టీజర్ పైనే !
Published on Sep 10, 2018 3:04 pm IST

సూపర్ స్టార్ రజినీకాంత్, అక్షయ్ కుమార్ , అమీ జాక్సెన్ ముఖ్య పాత్రల్లో ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘2.0’. ఎప్పుడో విడుదలకావల్సిన ఈ చిత్రం వీఎఫ్ఎక్స్ పనుల వల్ల ఆలస్యం అవుతూవస్తోంది. ఇక ప్రస్తుతం అందరి చూపు ఈ సినిమా టీజర్ పైనే వుంది. వినాయక చవితి రోజు సెప్టెంబర్ 13న ఈసినిమా టీజర్ 3డి &2డి ల్లో విడుదలకానుంది. ఇక ఈ టీజర్ ను ప్రదర్శించడానికి తమిళనాడులోని థియేటర్లు రెడీ అవుతున్నాయి.

భారత దేశ చలన చిత్ర చరిత్రలోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతుంది ఈ చిత్రం. ఏఆర్ రహెమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది. ఇక ప్రపంచంలోని 3000 మంది నిపుణులు ఈచిత్రం కోసం పనిచేస్తున్నారట. భారీ అంచనాలతో తెలుగు ,తమిళ , హిందీ భాషల్లో నవంబర్ 29న విడుదలకానుంది ఈచిత్రం.

  • 4
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook