తమిళ చిత్రం బిగిల్ ట్రైలర్ నిన్న సాయంత్రం ఆరు గంటలకు భారీగా విడుదల చేశారు. విడుదలైన కొన్ని గంటలలోనే ఈ ట్రైలర్ రికార్డ్ వ్యూస్ సాధించింది.విడుదలై 24గంటలు ముగియక ముందే బిగిల్ ట్రైలర్ 17మిలియన్స్ వ్యూస్ కి చేరిందంటే విజయ్ చిత్రంపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం అవుతుంది. చెన్నైలో నిన్న కొన్ని థియేటర్లలో బిగిల్ ట్రైలర్ ప్రత్యేక ప్రదర్శన వేయడం విశేషం.
మూడు వయసులలో మూడు విభిన్న గెటప్స్ లో ఉన్న విజయ్ లుక్స్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించేదిగా ఉంది. ఐతే తమిళంతో పాటు, తెలుగు కూడా ఈ మూవీ విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. కానీ తెలుగు ట్రైలర్ విడుదల చేయకపోవడం ఒకింత నిరాశకు గురిచేస్తుంది. తెలుగులో ట్రైలర్ వీక్షించాలని ఎదురు చూస్తున్న తెలుగు విజయ్ ఫ్యాన్స్ కోరిక రేపు లేదా ఎల్లుడింది లోపు తీరే అవకాశం కలదు. దీపావళి కానుకగా రానున్న ఈ మూవీ విడుదలకు ఇంకా కేవలం కొద్దిరోజుల టైం మాత్రమే ఉండటంతో తెలుగు ట్రైలర్ కూడా వెంటనే విడుదల చేయాలనీ చిత్ర నిర్మాతలు భావిస్తున్నారు.
