రెండేళ్ళ తర్వాత సెట్స్ మీదికి పవన్.. ఎగ్జైట్మెంట్లో ఫ్యాన్స్

Published on Jan 21, 2020 12:00 am IST

2018లో వచ్చిన ‘అఙ్ఞాతవాసి’ తర్వాత పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల్లో కనబడలేదు. ఆయన్ను వెండితెర మీద చూసి రెండేళ్లు కావొస్తోంది. ఈ రెండేళ్లు అభిమానులు ఆయన్ను చాలా మిస్సయ్యారు. సోషల్ మీడియా వేదికగా ఈ రెండు సంవత్సరాలు పవన్ సినిమాల్లో లేని లోటును వ్యక్తపరుస్తూ వచ్చిన ఫ్యాన్స్ అనేకసార్లు ఇంకొక్క సినిమా చేయమని కోరుతూ వచ్చారు.

వారి కోరిక ఇన్నాళ్ళకు నెరవేరింది. పవన్ ఎట్టకేలకు సెట్స్ మీదికి అడుగుపెట్టారు. వేణు శ్రీరామ్ డైరెక్షన్లో ‘పింక్’ సినిమా రీమేక్లో నటిస్తున్నారు. చిత్రీకరణలో పవన్ పాల్గొన్న ఫొటోలు బయటికొచ్చాయి. వాటిని చూసిన ఫ్యాన్స్ చాలా ఎగ్జైట్ అయిపోతూ త్వరలోనే తమకు కూడా ఫస్ట్ డే ఫస్ట్ షోలను ఎంజాయ్ చేసే అవకాశం దొరికిందని సంబరపడిపోతున్నారు. ట్రేడ్ వర్గాలు సైతం పవన్ రీఎంట్రీ సినిమా ఏ స్థాయిలో బిజినెస్ చేస్తుందో చూడాలని ఆసక్తిగా ఉన్నారు. పవన్ పార్టీ పరమైన పనులు చాలా ఉండటంతో సినిమా త్వరగానే పూర్తై ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం :

X
More