లుక్‌తోనే కిక్ ఇస్తున్న మెగా పవర్ స్టార్ !

Published on Jun 4, 2019 11:56 pm IST

రాజమౌళి సినిమా అంటే హీరోలు పూర్తిగా మారిపోతారు. లుక్ దగ్గర్నుండి పెర్ఫార్మెన్స్ వరకు అన్నీ కొత్తగా, గొప్పగా ఉంటాయి. ప్రస్తుతం ఆయన చేస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో సైతం రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరినీ కొత్తగా చూపించనున్నారు జక్కన్న. అందుకోసం ఇద్దరి లుక్స్ మార్చేశారు. వారిలో రామ్ చరణ్ లుక్ ఎలా ఉంటుదనేది పూర్తిగా రివీల్ అయిపోయింది.

ఇటీవలే చరణ్ తన సతీమణి ఉపాసనతో కలిసి ఆఫ్రికా ట్రిప్ వెళ్లారు. అక్కడ దిగిన ఫోటోలను ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తున్నారు. తాజాగా ఈరోజు కూడా కొన్ని ఫోటోలను రిలీజ్ చేశారు. అందులో చెర్రీ కోర మీసంతో కనిపిస్తూ అలరించాడు. అభిమానులైతే కొదమ సింహం సినిమాలో చిరంజీవిని చూసినట్టుందని తెగ సంబరపడిపోతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే ఇక సినిమాలో పూర్తి అల్లూరి సీతారామరాజు గెటప్లో ఇంకెంత గొప్పగా ఉంటాడో అని ఎగ్జైట్ అవుతున్నారు. మొత్తానికి కొత్త చరణ్ లుక్ ప్రేక్షకుల నుండి ఇప్పటికే ఫుల్ మార్కులు వేయించేసుకుంది. ఇప్పుడిప్పుడే కాలి గాయం నుండి కోలుకుంటున్న చరణ్ ట్రిప్ నుండి తిరిగి రాగానే షూటింగ్లో పాల్గొననున్నారు.

సంబంధిత సమాచారం :

More