‘బీస్ట్’గా అలరిస్తున్న విజయ్

Published on Jun 21, 2021 10:12 pm IST

ఇటీవలే ‘మాస్టర్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తమిళ స్టార్ హీరో విజయ్ తన తర్వాతి చిత్రాన్ని నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో చేస్తున్నారు. ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ కొద్దిసేపటి క్రితమే విడుదల చేశారు. విజయ్ సినిమాల ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ అంటే దాదాపుగా సినిమా విడుదలైనంత హడావుడి ఉంటుంది. అభిమానులు భీభత్సమైన హడావుడి చేస్తుంటారు. కేక్ కటింగ్స్, బాణాసంచా కాల్చడం లాంటి హంగామా ఉంటుంది. కానీ ఈసారి కరోనా కారణంగా ఆ హడావుడి సోషల్ మీడియాకే పరిమితం అయింది.

డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ అయితే అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఫస్ట్ లుక్ ఉండేలా ప్లాన్ చేశారు. స్టైలిష్ ట్రౌజర్ ధరించి షర్ట్ లేకుండా చేతిలో తుపాకీ పట్టుకుని చాలా పవర్ఫుల్ గా కనబడ్డాడు. ఇక టైటిల్ విషయానికి వస్తే అది కూడ అంచనాలను అందుకుంది. ‘బీస్ట్’ అనే టైటిల్ ఖరారు చేశారు. విజయ్ ఫ్యాన్స్ అయితే టైటిల్, ఫస్ట్ లుక్ రెండింటి పట్ల నూటికి నూరు శాతం సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ఇదే ట్రెండ్ అవుతోంది. మొత్తానికి ఈ ఫస్ట్ లుక్ సినిమా మీద అంచనాలను మరింత పెంచింది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా అనిరుద్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :