మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ బాక్సాఫీస్ సెన్సేషన్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad)నేటి నుంచి ఓటీటీ వేదికగా ప్రేక్షకులను పలకరిస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ప్రస్తుతం జీ5 లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగుతో పాటు మరో ఆరు భారతీయ భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉండటంతో డిజిటల్ వ్యూయర్స్ నుంచి భారీ స్పందన లభిస్తోంది.
అయితే, ఈ సినిమా ఓటీటీలోకి వచ్చిన ఆనందం ఒకవైపు ఉన్నా, టెక్నికల్ విషయం కారణంగా కొంతమంది అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. థియేటర్లలో ఈ చిత్రం ‘ఫ్లాట్ ఆస్పెక్ట్ రేషియో’ (Flat Aspect Ratio)లో ప్రదర్శితమై ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని ఇచ్చింది. కానీ ఓటీటీ వెర్షన్లో మాత్రం కేవలం ‘స్కోప్’ వెర్షన్‌ను మాత్రమే ఉంచడంతో, ఫ్లాట్ వెర్షన్‌ను కూడా అప్లోడ్ చేయాలని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా జీ5 ని కోరుతున్నారు.
ఈ చిత్రంలో హీరోయిన్గా నయనతార నటించగా, విక్టరీ వెంకటేష్ స్పెషల్ కామియోలో మెరిసి ఫ్యాన్స్‌ను ఖుషీ చేశారు. కేథరిన్ ట్రెసా, సచిన్ ఖేడేకర్, హర్షవర్ధన్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాను సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మించారు.
