చైతూ-సమంతలకు ఫ్యాన్స్ నుంచి సరికొత్త విన్నపం..!

Published on Oct 5, 2021 2:20 am IST


అక్కినేని నాగ చైతన్య-సమంతల నాలుగేళ్ల వైవాహిక జీవితానికి మొన్న ఎండ్ కార్డ్ వేసేశారు. వీరిద్దరు విడాకులు తీసుకుంటున్నట్టు చెప్పేయడంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే వీరిద్దరు విడిపోయిన మంచి ఫ్రెండ్స్‌గా ఉంటామని చెప్పడంతో వీరికి ఫ్యాన్స్ నుంచి సరికొత్త విన్నపం వినిపిస్తుంది. రియల్ లైఫ్‌లో వీరు కలిసి ఉండే ఛాన్స్ లేకపోయినా, రీల్ లైఫ్‌లో మాత్రం వీరిద్దరూ తిరిగి మరోసారి నటించాలని ఫ్యాన్స్ గట్టిగానే కోరుకుంటున్నారట.

ఇదిలా ఉంటే నాగ చైతన్య సమంతలు ఇద్దరు కలిసి తొలిసారి ‘ఏం మాయ చేసావే’ చిత్రంలో నటించగా, తర్వాత ‘ఆటోనగర్‌ సూర్య’, ‘మనం’, ‘మజిలీ’ చిత్రాల్లో నటించారు. ఇదే కాకుండా సమంత లీడ్ రోల్‌లో నటించిన ‘ఓ బేబీ’ సినిమాలో కూడా చైతూ గెస్ట్ రోల్ చేశారు. అయితే ఈ జోడీకి మంచి సక్సెస్‌లు ఉండడంతో మరోసారి వీరిద్ధరు కలిసి సినిమా చేయాలని ఫ్యాన్స్ నుంచి డిమాండ్స్ వినిపిస్తున్నాయి. చూడాలి మరీ భవిష్యత్‌లో వీరిద్దరి నుంచి ఏదైనా సినిమా వస్తుందేమో.

సంబంధిత సమాచారం :