రామ్ మరియు భీమ్ ల కోసం ఢిల్లీ లో భారీగా ఎదురు చూస్తున్న అభిమానులు!

Published on Mar 20, 2022 7:59 pm IST

దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటిస్తున్న చిత్రం రౌద్రం రణం రుధిరం. ఈ చిత్రం మార్చ్ 25 వ తేదీన భారీగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. అందుకు సంబంధించిన ప్రమోషన్స్ ను సైతం వేగవంతం చేయడం జరిగింది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి విశేష స్పందన లభిస్తోంది.

ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగం గా ఢిల్లీ లోని ఇంపీరియల్ హోటల్ లాన్స్ లో చిత్ర యూనిట్ ఈవెంట్ ను నిర్వహించనుంది. ఈ ఈవెంట్ లో రామ్ మరియు భీమ్ కోసం భారీగా అభిమానులు ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఒక ఫోటో ను ఆర్ ఆర్ ఆర్ మూవీ టీమ్ సోషల్ మీడియా వేదిక గా షేర్ చేయడం జరిగింది. ఆ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారుతోంది. అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, కొమురం భీమ్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ లు నటిస్తున్నారు. అలియా భట్, ఒలివియా మోరిస్ లు హీరోయిన్స్ గా నటిస్తుండగా, శ్రియ శరణ్, అజయ్ దేవగన్, సముద్ర ఖని లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని డివివి దానయ్య భారీ బడ్జెట్తో నిర్మించడం జరిగింది.

సంబంధిత సమాచారం :