‘నేను పాకిస్థానీ కాను’.. క్లారిటీ ఇచ్చిన ‘ఫౌజీ’ హీరోయిన్

‘నేను పాకిస్థానీ కాను’.. క్లారిటీ ఇచ్చిన ‘ఫౌజీ’ హీరోయిన్

Published on Apr 24, 2025 1:10 PM IST

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 28 మంది పర్యాటకులు మరణించారు. ఈ ఘటనతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. అటు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ దాడిపై పలు కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఇక సోషల్ మీడియాలో ఈ దాడిపట్ల పెద్ద దుమారం రేగింది. పాకిస్థాన్‌కు సంబంధించిన అన్ని విషయాలపై సోషల్ మీడియాలో వ్యతిరేకత వ్యక్తమయ్యింది. అయితే, ఈ వ్యతిరేకత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘ఫౌజీ’ చిత్ర హీరోయిన్ ఇమాన్వి వరకు వెళ్లింది.

ఇమాన్వి తండ్రి మాజీ పాకిస్థానీ మిలిటరీ అధికారి అని.. ఆమె ఇండియన్ సినిమాలో నటించకూడదని పలువురు సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. దీంతో ఈ వార్త ఆమె వరకు చేరింది. దీంతో ఆమె తాజాగా ఈ వివాదంపై క్లారిటీ ఇచ్చింది. తనకు పాకిస్థాన్ నుంచి ఎలాంటి సంబంధం లేదని.. తాను పాకిస్థానీ కాదంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఇక తన తండ్రి పాకిస్థానీ మాజీ అధికారి అనే వార్త పూర్తిగా అవాస్తవం అని ఆమె పేర్కొంది. తన తల్లిదండ్రులు ఇండో-అమెరికన్స్ అని.. తాను పుట్టింది లాస్ ఏంజిల్స్‌లో అని ఆమె వివరించింది.

ఆమె గుజరాతీ, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలను మాట్లాడగలని.. చదువు పూర్తయిన తర్వాత ఆర్ట్స్ నేర్చుకున్నానని ఆమె తెలిపింది. ఇండియన్ సినిమాలో భాగం అవుతున్నందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందని.. దయచేసి తనపై తప్పుడు ప్రచారాలు చేయవద్దని ఆమె ఈ సందర్భంగా కోరారు. దీంతో ఇమాన్వి తనపై వస్తున్న ట్రోలింగ్‌కు సాలిడ్ రిప్లై ఇచ్చినట్లు అయ్యింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు