గతవారం విడుదలైన గద్దలకొండ గణేష్ పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో పాటు, వరుణ్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ సాధించింది. చిత్రాల వర్గాల సమాచారం ప్రకారం గద్దలకొండ గణేష్ చిత్రం ఆరు రోజులకు గాను వరల్డ్ వైడ్ గా 30కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ మేరకు చిత్ర బృందం నిన్న ఓ పోస్టర్ విడుదల చేయడం జరిగింది. కాగా రెండవ వారం కూడా ఈ చిత్రానికి బాక్సాపీస్ వద్ద అనుకూల పరిస్థితులు నెలకొన్నాయి.
అధికారికంగా నేడు నాలుగు చిన్న సినిమాల విడుదల ఉన్నట్లు సమాచారం. నిన్ను తలచి, రామ చక్కని సీత, మిర్రర్, రాయలసీమ లవ్ స్టోరీ అనే నాలుగు చిన్న సినిమాల విడుదల నేడు కలదు. వీటిలో అన్ని చిత్రాలు అనుకున్న ప్రకారం విడుదల అవుతాయనే నమ్మకం కూడా లేదు. ఈ చిత్రాల గురించి ప్రేక్షకులకు తెలిసింది చాలా తక్కువ. కాబట్టి గతవారం సూర్య మూవీ బందోబస్త్ నుండి పోటీ ఎదుర్కున్న గద్దలకొండ గణేష్ మూవీ నేడు సోలో వీకెండ్ అవకాశం దక్కించుకొన్నట్లే లెక్క. బందోబస్త్ పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉన్న నేపథ్యంలో వరుణ్ చిత్రానికి వసూళ్లు పెరిగే అవకాశం కలదు. మరి చూడాలి ఈ అనుకూల వాతావరణాన్ని గద్దలకొండ గణేష్ చిత్రం ఏమాత్రం ఉపయోగించుకొంటుందో.


