ధనుష్ కు జోడిగా మలయాళ బ్యూటీ !

Published on Jan 22, 2019 2:42 pm IST


ఇటీవల మారి 2 చిత్రం తో ప్రేక్షకులముందుకు వచ్చిన తమిళ హీరో ధనుష్ తన కొత్త చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నాడు. వెట్రిమారన్ దర్శకత్వంలో ‘అసురన్’ అనే చిత్రంలో నటించనున్నాడు ధనుష్. ఇక ఈ చిత్రంలో ట్యాలెంటడ్ మలయాళ నటి మంజు వారియర్ కథానాయికగా నటించనుంది. పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని వి క్రియేషన్స్ పతాకం ఫై ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్ థాను నిర్మించనున్నారు. జనవరి 26నుండి సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. కాగా ధనుష్ -వెట్రి మారన్ కలయికలో ఇది నాల్గవ చిత్రం కావడం విశేషం.

అయితే ఈచిత్రానికి ముందు ధనుష్ మల్టీ స్టారర్ చిత్రాన్నితెరకెక్కించాల్సి వుంది. ఇటీవలే ఒక షెడ్యూల్ పూర్తి చేసిన ఈ చిత్రాన్ని ధనుష్ ,అసురన్ కోసం పక్కకుపెట్టేశాడు.

సంబంధిత సమాచారం :