సుకుమార్ ఆ పాయింట్ ని కూడా టచ్ చేస్తారా?

సుకుమార్ ఆ పాయింట్ ని కూడా టచ్ చేస్తారా?

Published on Aug 6, 2020 8:44 AM IST

డైరెక్టర్ సుకుమార్ పుష్ప మూవీని రెడ్ శాండిల్ స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో బన్నీ లారీ డ్రైవర్ రోల్ చేస్తుండగా ఆయన పాత్రపై ప్రేక్షకులలలో భారీ ఆసక్తి నెలకొని ఉంది. అడవి నుండి అక్రమంగా ఎర్ర చందనం తరలించే డ్రైవర్ గా ఆయన పాత్ర ఉంటుందని సమాచారం. అడవిలో ఆణువణువు తెలిసి, పోలీసులను ముప్పతిప్పలు పెట్టేస్తాడట. ఈ క్రమంలో భారీ ఛేజింగ్, రన్నింగ్ సన్నివేశాలు ఉంటాయని తెలుస్తుంది.

కాగా ఈ మూవీలో స్మగ్లర్లు, పోలీసుల మధ్యలో నలిగిపోయే కూలీల కష్టాలను కూడా సుకుమార్ పుష్ప మూవీలో ప్రస్తావిస్తాడని సమాచారం. గతంలో అనేక మంది చెట్లు నరికే కూలీలు పోలీసుల కాల్పుల్లో మరణించారు. మరి ఈ విషయాలను కూడా పుష్పలో సుకుమార్ చూపిస్తాడా అనే విషయం ఆసక్తి రేపుతోంది. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కిస్తుండగా రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు