15 కోట్ల వ్యూస్‌ తో రికార్డ్ సృష్టించిన క్రేజీ హీరోయిన్ సాంగ్ !

15 కోట్ల వ్యూస్‌ తో రికార్డ్ సృష్టించిన క్రేజీ హీరోయిన్ సాంగ్ !

Published on Sep 19, 2018 4:00 PM IST

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సాయి పల్లవి హీరో హీరోయిన్లు గా నటించిన ‘ఫిదా’ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన అభినయంతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయిన సాయి పల్లవి, ఈ చిత్రంతోనే తెలుగులో మంచి క్రేజ్ సంపాందించుకుంది. ముఖ్యంగా సాయి పల్లవి మీద తెరకెక్కించిన ‘వచ్చిండే… ‘పాట ఈ సినిమాకే హైలెట్ గా నిలిచింది. ఇప్పటికీ ఈ సాంగ్ కి ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. నెటిజన్లు ఇప్పటికే ఈ సాంగ్ నే చూసి ఎంజాయ్ చేస్తున్నారు. అందుకే తాజాగా ఈ సాంగ్ ఇప్పుడు వార్తల్లో నిలిచింది.

వివరాల్లోకి వెళ్తే.. ‘వచ్చిండే… ‘ వీడియో సాంగ్ యూట్యూబ్ లో సంచలనాల దిశగా దూసుకెళ్తుంది. ఇప్పటివరలు 150 మిలియన్ల (15 కోట్లు) వ్యూస్‌ తెచ్చుకుని.. రికార్డ్ సృష్టించింది. శక్తికాంత్‌ కార్తీక్‌ సంగీత సారధ్యంలో మధుప్రియ, రాంకీలు పాడిన ఈ పాటను సుద్దాల అశోక్‌ తేజ రాశారు. ప్రస్తుతం సాయి పల్లవి హనురాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్ కి జోడిగా ‘పడి పడి లేచె మనసు’ చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రంలో సాయి పల్లవి తన నటనతో మరిసారి తెలుగు ప్రేక్షకులను సమ్మోహనపరచనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు