‘ఫైటర్’ పాన్ ఇండియా రేంజ్ రాబోతున్నాడట !

Published on Dec 4, 2019 1:36 am IST

పూరి జగన్నాథ్ తన తరువాత సినిమాని సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండతో చెయ్యబోతున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాని, పూరి పాన్ ఇండియా లెవల్లో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా స్టోరీ కూడా యూనివర్సల్ గా వర్కౌట్ అయ్యే విధంగా ఉందని.. ఇతర భాషల ప్రేక్షుకులకు కూడా స్క్రిప్ట్ బాగా కనెక్ట్ అవుతుందని పూరి ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం పూరి టీమ్ బాలీవుడ్ అండ్ కోలీవుడ్ లకు సంబంధించిన కొంతమంది నిర్మాతలతో ఈ ప్రాజెక్ట్ భాగస్వామ్యం గురించి చర్చిస్తున్నారట.

కాగా ఈ సినిమాలో కియారా అద్వానీ విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే వీరిద్దరూ ఓ యాడ్ ఫిల్మ్ లో కలిసి నటించారు. ఈ సినిమా కూడా పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి కనెక్ట్స్ ప‌తాకాల‌ పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించనున్నారు.

సంబంధిత సమాచారం :

X
More