ప్లాస్టిక్, కాస్మెటిక్, ఎస్తటిక్ సర్జరీల కు పేరొందిన హెచ్‌కే హాస్పిటల్స్, గచ్చిబౌలిలోని లుంబినీ ఎంక్లేవ్‌లో ఏర్పాటైంది. ఈ ప్రారంభోత్సవ వేడుక సినీ ప్రముకులు, సెలబ్రెటీలతో కళకళలాడింది. అత్యాధునిక సదుపాయాలు, నిపుణుల సంరక్షణతో ప్రపంచ స్థాయి ఎస్తటిక్, రికన్స్ట్రక్టివ్ చికిత్సలను ఒకేచోట అందించేందుకు నెలకొల్పిన ఈ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి, టాలీవుడ్ ప్రముఖులు బిగ్‌బాస్ తెలుగు స్టార్‌లు తళుకుమన్నారు. ఈ స్టార్-స్టడెడ్ లాంచ్ లో సంగీత దర్శకుడు మణిశర్మ, కమెడియన్ అలీ, నటి అనసూయ, నటుడు సంతోష్ శోభన్ పాల్గొన్నారు. దర్శకుడు సాయి రాజేష్, నిర్మాత ఎస్‌కేఎన్, దీప్తి సునైనా, అలేఖ్య హారిక, గీతూ, సీత, కీర్తి భట్, సిరి శ్రీహాన్, నిఖిల్ విజయేంద్ర సింహా, శివజ్యోతి గంగూలీ, సంపూర్ణేష్ బాబు, జస్వంత్ జెస్సీ, శ్రావంతి చోకారపు వంటి పలువురు ప్రముఖులు సైతం ఈ వేడుకలో పాల్గొని హెచ్‌కే హాస్పిటల్స్ మేనేజ్‌మెంట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్బంగా మీడియాతో హెచ్‌కే హాస్పిటల్స్ వ్యవస్థాపకులు హర్షిత, కార్తిక్ మాట్లాడుతూ, “ అత్యాధునిక సాంకేతికతను నిపుణుల సంరక్షణతో కలిపి విలాసవంతమైన, పేషెంట్-సెంట్రిక్ వాతావరణాన్ని అందించాలనే లక్ష్యంతో తమ సెంటర్ ని నెలకొల్పామని చెప్పారు. హెచ్‌కే హాస్పిటల్స్ అందిస్తున్న ముఖ్యమైన సేవల్లో ప్లాస్టిక్ సర్జరీ, కాస్మెటిక్ గైనకాలజీ, కాస్మెటిక్ డెర్మటాలజీ, హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్, కాస్మెటిక్ డెంటిస్ట్రీ, పర్మనెంట్ మేకప్, గైనకాలజీ ఉన్నాయని తెలిపారు


