మంచు విష్ణు ప్రయత్నానికి ప్రముఖుల సపోర్ట్..!

మంచు విష్ణు ప్రయత్నానికి ప్రముఖుల సపోర్ట్..!

Published on Aug 2, 2014 10:46 AM IST

Vishnu

మంచు విష్ణు, రామ్ గోపాల్ వర్మ కలయికలో రూపొందిన తాజా సినిమా ‘అనుక్షణం’. తేజస్వి, మధుశాలిని, రేవతి, బ్రహ్మానందం కీలక పాత్రలలో నటించారు. ఇటివల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తించింది. అమ్మాయిలూ జాగ్రత్త అనేది కాప్షన్. 24 ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై అరియాన – వివియాన సమర్పణలో మంచు విష్ణు నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

‘అనుక్షణం’ విడుదల చేయడానికి మంచు విష్ణు, వర్మలు కొత్త పంధాను అనుసరిస్తున్నారు. సినిమా విడుదల చేసే అవకాశం ప్రతి ఒక్కరికి కల్పిస్తున్నారు. ‘అనుక్షణం’ సినిమాను వేలం పాట వేస్తున్నారు. తమ ఏరియాలలో సినిమా విడుదల చేయలనుకోనేవారు వేలం పాటలో పాల్గొని పంపిణి హక్కులను సొంతం చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు filmauction.in వెబ్ సైట్ ను సందర్శించండి.

బిడ్డింగ్ పద్ధతిలో సినిమాను విడుదల చేయాలనుకొనే ఆలోచనపై చాలా కసరత్తు చేసినట్టు విష్ణు తెలిపారు. దాసరి గారితో పాటు పలువురు ప్రముఖులకు ఈ బిడ్డింగ్ పద్ధతి గురించి చెప్పగానే మంచి ప్రయత్నం ముందుకు వెళ్ళండి అని ప్రోత్సహించారు అని విష్ణు అన్నారు.

సైకో కిల్లర్ వేటలో మంచు విష్ణు..!

తాజా వార్తలు