సైకో కిల్లర్ వేటలో మంచు విష్ణు..!

సైకో కిల్లర్ వేటలో మంచు విష్ణు..!

Published on Jul 31, 2014 6:34 PM IST

anukshanam

మంచు విష్ణు, సంచలనాత్మక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కలయికలో తెరకెక్కుతున్న సినిమా ‘అనుక్షణం’. అమ్మాయిలూ జాగ్రత్త అనేది కాప్షన్. టైటిల్ & కాప్షన్ లతో సినిమాపై ఆసక్తి కలిగించారు వర్మ. ఈ రోజు విడుదలైన ‘అనుక్షణం’ ట్రైలర్ ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసింది. ఈ మధ్య కాలంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగస్తులు ఎక్కువగా క్యాబ్ డ్రైవర్ల అరాచకాలకు బలవుతున్నారు. అలా వరుస హత్యలకు పాల్పడుతున్న ఒక సైకో కిల్లర్ ను వేటాడే పోలీస్ ఆఫీసర్ గా మంచు విష్ణు నటించారు.

సాధారణంగా గ్యాంగ్ స్టర్ , మాఫియా కథలను, హారర్ సినిమాలను ఇష్టపడే వర్మ తన సినిమాలలో హీరోలను మాక్సిమం రౌడీలుగా, క్రిమినల్స్, సైకోలుగా చూపిస్తారు. భిన్నంగా ఇందులో విష్ణు పోలీస్ ఆఫీసర్ గా కనిపించారు. ట్రైలర్ ను చూస్తే సినిమా పవర్ ప్యాక్డ్ థ్రిల్లర్ గా అనిపిస్తుంది. ఫస్ట్ టైం చూడగానే అందరిని ఆకట్టుకుంది. బర్నింగ్ ఇష్యూ మీద తీసిన ఈ సినిమా బంపర్ ఓపెనింగ్స్ సాదిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అమ్మాయిల సేఫ్టీ కోసం ఏవైనా సలహాలు, సూచనలు ఇచ్చారేమో చూడాలి.

‘అనుక్షణం’ ట్రైలర్ లో విష్ణుతో పాటు మరో హీరో నవదీప్ తళుక్కున మెరిశాడు. అతని పాత్ర ఏమిటనేది ప్రస్తుతానికి సస్పెన్స్. తేజస్వి, మధుశాలిని, రేవతి, బ్రహ్మానందం ఇతర పాత్రలు పోషించారు.

ట్రైలర్ : అనుక్షణం (మంచు విష్ణు)

సంబంధిత సమాచారం

తాజా వార్తలు