ప్రముఖ మహిళా దర్శకురాలు మృతి !

ప్రముఖ మహిళా దర్శకురాలు మృతి !

Published on Sep 23, 2018 6:06 PM IST

బాలీవుడ్ దర్శకురాలు కల్పన లాజ్మి మూత్ర పిండాల సమస్యతో గత కొంతకాలంగా బాధపడుతున్నారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ హాస్పిటల్ లో ఆమె చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. ఆమె వయస్సు అరవై నాలుగు సంవత్సరాలు. కల్పన లాజ్మి ఎక్కువుగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలను తెరకెక్కించారు. ఆమె రూపొందించిన చిత్రాల్లో , చింగారి, ఏక్ పల్, డామన్ వంటి సినిమాలు ఉన్నాయి.

దర్శకురాలు కల్పన లాజ్మి మృతి పట్ల ఇప్పటికే పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు. మహిళా దర్శకురాల్లో ఆమె గొప్ప దర్శకురాలు అని, ఆమెతో కలిసి పని చేసిన వారు చెబుతున్నారు, అయితే ఆమె ఈ రోజు తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో తుదిశ్వాస విడిచినట్టు ఆమె సోదరుడు దేవ్ లాజ్మి చెప్పారు. ప్రస్తుతం ఓషివారా శ్మశానవాటికలో ఆమె అంత్యక్రియలను నిర్వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు