అఖండ ఫైనల్ షెడ్యూల్ షురూ… వర్కింగ్ స్టిల్ విడుదల!

Published on Jul 12, 2021 6:42 pm IST

తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని కాంబినేషన్ లు పవర్ ఫుల్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ లుగా మారిపోయాయి. అందులో కచ్చితంగా టాప్ లో ఉండేది నందమూరి బాలకృష్ణ మరియు బోయపాటి శ్రీను లు అని చెప్పాలి. వీరి ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో సత్తా చాటాయో అందరికీ తెలిసిందే. అయితే మరొకసారి బాలకృష్ణ, బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లు, వీడియోలు ఇప్పటికే సినిమా పై భారీ అంచనాలను పెంచేశాయి. అయితే ఇప్పటికీ రెండు గెటప్ లలో బాలయ్య పవర్ ఫుల్ గా కనిపించారు. అయితే ఈ చిత్రం కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ను చిత్ర యూనిట్ అభిమానులతో పంచుకున్నారు.

బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న అఖండ చిత్రం షూటింగ్ ఆఖరి షెడ్యూల్ నాటినుండి మొదలు అయింది అని చిత్ర యూనిట్ వెల్లడించింది. అందుకు సంబంధించిన వర్కింగ్ స్టిల్ ను సైతం సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్నట్లు తెలిపడం జరిగింది. అయితే వీరిద్దరి కలయిక లో చరిత్ర సృష్టించడానికి మళ్ళీ వస్తున్నారు అని, ధియేటర్ల లో గర్జించేందుకు సిద్దం అవుతున్నట్లు తెలిపారు. అయితే చిత్ర యూనిట్ విడుదల చేసిన వర్కింగ్ స్టిల్ అభిమానులను తెగ ఆకట్టుకుంటుంది. ద్వారక క్రియేషన్స్ పతాకంపై మిరియాల రవీందర్ రెడ్డి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలయ్య సరసన హీరోయిన్ గా ప్రగ్యా జైస్వాల్ నటిస్తుండగా ఈ చిత్రానికి సంగీతం థమన్ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :