యాక్షన్ లోకి దిగిన “శ్యామ్ సింగరాయ్”

Published on Jul 1, 2021 11:55 pm IST


న్యాచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న చిత్రం శ్యామ్ సింగారాయ్. ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల అయినప్పటి నుండి అభిమానులు, ప్రేక్షకులు ఈ చిత్రం పై ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నారు. అయితే ఈ చిత్రం ఫైనల్ షెడ్యూల్ నేటి నుండి మొదలు అయినట్లు తెలుస్తోంది. చిత్ర షూటింగ్ లో భాగంగా నేడు నాని పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఒక ఫోటో ను సైతం చిత్ర యూనిట్ సోషల్ మీడియా లో షేర్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ ఫోటో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

నాని హీరో మొదటి సారి చాలా భిన్న పాత్రలో నటిస్తున్నారు. థ్రిల్లర్ మూవీ గా వస్తున్న ఈ చిత్రం లో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా హీరోయిన్ లుగా నటిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సంగీతం మిక్కీ జే మేయర్ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :